కాకినాడ : ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షా ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో కాకినాడ విద్యార్థిని అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. నేహాంజని అనే విద్యార్థిని చరిత్రలోనే మొట్టమొదటి సారి అన్ని సబ్జెక్టుల్లో 600 మార్కులకు గాను 600 మార్కులు సాధించి రికార్డ్ సృష్టించింది.
సదురు విద్యార్థిని కాకినాడలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతోంది. కాగా, తాజాగా విడుదలైన పది ఫలితాల్లో 81.14 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అందులో బాలురు 78.31 శాతం ఉండగా, బాలికలు 84.09 శాతం ఉత్తీర్ణత సాధించారు. మార్చి 17 నుంచి మార్చి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,450 పరీక్షా కేంద్రాల్లో టెన్త్ పబ్లిక్ పరీక్షలను నిర్వహించారు. మొత్తం 6,19,275 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అందులో 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలున్నారు. వారిలో 5,64,064 మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియం చెందిన వారు ఉండగా.. తెలుగు మీడియంలో వారు 51,069 మంది విద్యార్థులున్నారు.