వెలగపూడి | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు జరిగే అవకాశం ఉంది. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నాయుడి నివాసంలో ఈ మీటింగ్ ను ఏర్పాటు చేశారు.
ఈ నెల 21వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో టీడీపీపీ సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ భేటీలో టీడీపీ ఎంపీలు 16 మందితో పాటు ఇద్దరు రాజ్యసభ సభ్యులు కూడా హాజరు కానున్నారు. వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటులో టీడీపీ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహాలు, సమస్యలపై చర్చించేందుకు టీడీపీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా పార్టీ ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్థేశం చేయనున్నారు.

