శ్రీ సత్యసాయి బ్యూరో (ఆంధ్రప్రభ):ప్రజల ఆరోగ్యం, (health ) భద్రతతో (safety ) పాటు జంతు సంక్షేమం (anial ) , పౌరశుభ్రత వంటి విషయాలలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ (minister satyakumar yadav) పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు సిబ్బంది నియామకం స్టడీలైజేషన్ విధానాలను మంత్రి సత్య కుమార్ సమీక్షించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆదివారం మూడవరోజు మంత్రి పట్టణంలోని 21 ,22 వార్డులలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాన్ని సందర్శించారు.
ధర్మవరంలో దాదాపుగా 3 000 వీధి కుక్కల జనాభా ఉన్నట్లు అంచనా వేయగా పౌరులు ముఖ్యంగా పిల్లల, వృద్ధుల భద్రత నిర్ధారించడానికి క్రమబద్ధమైన జనాభా నియంత్రణ యొక్క తక్షణ అవసరాన్ని ఆయన ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. ప్రధానంగా ఏబీసీ సౌకర్యాల సామర్థ్యం వైద్య సిబ్బంది నిర్వహణ విధానాల గురించి వివరంగా విచారించారు. భారత జంతు సంక్షేమ బోర్డు (ఏడబ్ల్యుబిఐ) మార్గదర్శకాలకు అనుగుణంగా స్టెరిలైజేషన్ ప్రయత్నాలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.విచ్చలవిడిగా ఉన్న జంతువుల జనాభాను నిరోధించడానికి మానవ శాస్త్రీయ, సమాజ సున్నితమైన విధానాల ప్రాముఖ్యతను మంత్రి చెప్పడం జరిగింది. క్రమం తప్పకుండా పర్యవేక్షణ టీకా డ్రైవ్ లను పెంచడం మున్సిపల్ సిబ్బందితో అంతర్భాగంగా సమన్వయం కొనసాగించాలన్నారు.
ఆర్తో హ్యాండీక్యాప్డ్ కు ప్రత్యేక కోటా కృషి….
రాష్ట్రంలో హ్యాండీక్యాప్డ్ కోటాలో అంధులకు ఏ విధంగా అయితే ప్రత్యేక కోటా కింద ఉద్యోగాలలో ప్రాధాన్యత ఇస్తున్నారో అదేవిధంగా రెండు చేతులు లేని ఆర్తో హ్యాండీక్యాప్డ్ కు సైతం ప్రత్యేక కోటా వర్తింపజేసే విధంగా కృషి చేస్తానని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. ఆదివారం ధర్మవరంలోని 21వ వార్డులో రెండు చేతులు లేని ఒక అమ్మాయి మంత్రితో మాట్లాడుతూ తాను ఇంటర్ పూర్తి చేయడమే కాకుండా టీచర్ ట్రైనింగ్ సైతం పూర్తిచేసి, ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగిందన్నారు. కానీ తనకు కేవలం హ్యాండీక్యాప్డ్ కూడా కిందనే రిజర్వేషన్ ఉన్న కారణంగా ఉద్యోగం పొందలేకపోతున్నాను అన్నారు. కావున నాలాంటి రెండు చేతులు లేని ఆర్తో హ్యాండీక్యాప్డ్ కు సైతం ప్రత్యేక కోటా కింద పరిగణిస్తే ఉద్యోగ అవకాశము కలుగుతుందని తెలిపారు. ఇందుకు మంత్రి సత్య కుమారస్వామి స్పందిస్తూ ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తో ప్రత్యేకంగా చర్చించి ప్రత్యేక కోటా వర్తింప చేసే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.