AP| లిక్కర్‌ స్కాం కేసులో సజ్జల శ్రీధర్‌రెడ్డి కి 14 రోజుల రిమాండ్

విజయవాడ : లిక్కర్‌ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ6గా ఉన్న సజ్జల శ్రీధర్‌రెడ్డిని అరెస్ట్‌ అయ్యారు. ఆయనను నేడు విజయవాడలోని ఎసిబి కోర్టులో ప్రవేశపెట్టగా మే 6వ తేది వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు.. దీంతో ఆయనను జిల్లా జైలుకు తరలించారు. కాగా, ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్‌ కసిరెడ్డి, ఏ8గా ఉన్న ఆయన తోడల్లుడు చాణక్యను అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ కేసులో ఎ 6 గా ఉన్న సజ్జల శ్రీధర్‌రెడ్డిని ఎపి సిట్‌ అధికారులు గత రాత్రి హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు తరలించారు..నేటి ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి ఎసిబి కోర్టులో సిట్‌ అధికారులు హజరుపరిచారు.. కేసు డైరీని పరిశీలించిన న్యాయమూర్తి రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply