మంగళగిరి / టెక్కలి – ప్రజా సమస్యల పరిష్కారానికి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ వినూత్న కార్యక్రమం చేపట్టారు. వెండి తెర ప్రత్యక్ష ప్రసారం ద్వారా మంగళగిరిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి ప్రజలతో ఆయన ముఖా ముఖీ నిర్వహించారు. మన ఊరు – మాటామంతి కార్యక్రమం ద్వారా శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలోని రావివలస గ్రామస్తులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉండే సినిమా థియేటర్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.. ఉప ముఖ్యమంత్రి మాటలు వినడమే కాకుండా పలువురు తమ సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు.. అలాగే వారి సమస్యలను ఆన్ లైన్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తుల సమస్యలు వెంటనే పరిష్కరించేలా చూడాలని ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు.
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పవన్ వెల్లడించారు. అభిమానుల తాకిడి, భద్రత కారణాల వల్ల ప్రజలతో నేరుగా కలవలేకపోతున్నానని అంటూ ఈ క్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలతో నేరుగా మాట్లాడాలని నిర్ణయించినట్లు తెలిపారు..
ఈ కార్యక్రమం కోసం రావివలస గ్రామానికి చెందిన 290 మందిని హాజరయ్యారు. గురువారం ఉదయం 9 గంటలకు మొదలైన ఈ లైవ్ షో మూడు గంటలకు పైగా సాగింది. ఇది ఇలా ఉంటే వెండి తెరను.. ప్రజల వేదన తీర్చే సాధనంగా మార్చారంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను గ్రామస్తులు ప్రశంసించారు.