రాజమండ్రి : అల్లూరి జిల్లాలోని దేవీపట్నం నుంచి పాపికొండల విహారయాత్రను జలవనరుల శాఖ నేటి నుంచి తాత్కాలికంగా నిలిపివేసింది. వర్షంతో పాటు గోదావరిలో నీటిమట్టం పెరుగుతున్న కారణంగా అధికారులు ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు దేవీపట్నం మండలం దండంగి, డి.రావిలంక గ్రామాల మధ్య ఆర్అండ్‌బీ రహదారిపై గోదావరి వరద ప్రవాహం పెరిగింది. దీంతో గండి పోచమ్మ ఆలయం వైపునకు రాకపోకలు నిలిచిపోయాయి.