Ap Legacy Calendar : ఇదే సజీవ వారసత్వం

Ap Legacy Calendar : ఇదే సజీవ వారసత్వం
ఏపీ అసెంబ్లీ –2026 కేలెండర్ ఆవిష్కరణ
ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు
( ఆంధ్రప్రభచ, అమరావతి)
ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ ప్రచురించిన 2026 కేలెండర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో మంగళవారం స్పీకర్ అయ్యన్న పాత్రుడుతో కలిసి ముఖ్యమంత్రి వాల్ కేలెండర్, టేబుల్ కేలెండర్, డైరీలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పయ్యావుల కేశవ్, శాసన పరిషత్ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర పాల్గొన్నారు.

Ap Legacy Calendar : ఇదే సజీవ వారసత్వం

జీవవైవిధ్యం (Biodivirasity) – ఆంధ్రప్రదేశ్ సజీవ వారసత్వం (Living Legacy) అనే థీమ్ (Theme) తో ఈ కేలెండర్ రూపొందించారు. తూర్పు కనుమలు, విశాలమైన గడ్డి మైదానాలు, కోరింగా మడ అడవులు, సుదీర్ఘ బంగాళాఖాత తీరప్రాంతం…ఇలా ఆంధ్రప్రదేశ్లోని విభిన్న ఆవరణ వ్యవస్థలకు చెందిన పన్నెండు వన్యప్రాణుల చిత్రాలతో కేలెండర్ తయారు చేశారు.
ప్రకృతి (Natural Ltgacy) వారసత్వం, కళా సంప్రదాయం (Art tradition) , ఆధునికతలను మేళవింపు చేశారు. సాంప్రదాయ కలంకారీ శైలిలో అత్యంత సుందరంగా చిత్రాలను తీర్చిదిద్దారు. ఈ చిత్రాలు రూపొందించేందుకు ఏఐని వినియోగించామని ప్రసన్న కుమార్ వివరించారు. 2026 సంవత్సర క్యాలెండర్ను చక్కగా డిజైన్ (Good Design) చేశారని సీఎం అన్నారు.

ప్రకృతిని కాపాడుకోవాలనే మంచి సందేశంతో క్యాలెండర్ ఉందని ప్రశంసించారు. పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ (Wild Life Protrction) గురించి ఈ క్యాలెండర్ గొప్ప సందేశాన్ని ఇస్తోందని, అలాగే వాతావరణ మార్పుతో కలిగే పరిణామాలనూ వివరిస్తోందని అన్నారు. ప్రకృతిని కాపాడుకోవాలనే మన సమిష్టి బాధ్యతను ఈ కేలెండర్ గుర్తుచేస్తుందని అన్నారు.

స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన వన్యప్రాణి, పర్యావరణ పరిరక్షణ కమిటీ ఉండటం సంతోషించాల్సిన విషయమని తెలిపారు. (Speaker) స్పీకర్ మాట్లాడుతూ…పర్యావరణం, వన్యప్రాణుల సంరక్షణ పట్ల శాసనసభకు ఉన్న నిబద్ధత, వన్యప్రాణులు, ప్రకృతిని కాపాడాల్సిన ఆవశ్యకతపై సమాజాన్ని చైతన్యపరిచేందుకు ప్రజాప్రతినిధుల సభ చేస్తున్న ప్రయత్నంగా 2026 కేలెండర్ను రూపొందించినట్లు స్పీకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి పయ్యావుల కేశవ్, శాసన వ్యవస్థ సెక్రటరీ- జనరల్ ప్రసన్న కుమార్ పాల్గొన్నారు.
