AP | బిజెపిలోకి కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ

కర్నూలు బ్యూరో, , ఆంధ్రప్రభ..కోడుమూరు మాజీ ఎమ్మెల్యే, డిసిసి మాజీ అధ్యక్షుడు పి.మురళీకృష్ణ బిజెపిలో చేరారు. ఈ మేరకు ఆయనఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సమక్షంలో ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు బిజెపిలో చేరడం విశేషం. పరిగెలకు పురంధేశ్వరి పార్టీ కండువా కప్పి, సాధరంగా ఆహ్వానించారు.

ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర స్ధాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో పార్టీ కండువా కప్పుకోవడం గమనార్హం. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉంటూ కోట్ల వర్గీయుడిగా మురళీకృష్ణ గుర్తింపు పొందారు. వారి చొరవతో గతంలో కోడుమూరు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ కనుమరుగు అవడంతో ఆ తర్వాత కొన్ని రోజులు మురళీకృష్ణ తటస్థంగా ఉంటూ వచ్చారు.

అనంతరం వైసీపీలో చేరారు. అప్పటి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు టీటీడీ బోర్డు మెంబర్ గా పదవి కట్టబెట్టారు. ఈ క్రమంలో వైసిపి నుంచి కోడుమూరు టికెట్ ను ఆశించారు. అయితే టికెట్ మరొకరికి కట్టడంతో.. తిరిగి మురళీకృష్ణ కాంగ్రెస్ లో చేరారు. డిసిసి అధ్యక్షులుగా ఆయన కొనసాగుతున్న క్రమంలో కొన్ని సొంత నిర్ణయాలతో డిసిసి అధ్యక్ష పదవిని కోల్పోయారు. ప్రస్తుతం ఆయన బిజెపి కండువా కప్పుకోవడం చర్చ నియాంశంగా మారింది.

Leave a Reply