రాజంపేట, ఆంధ్రప్రభ – ఎపిలోని అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని కృష్ణమురళి నేడు స్వల్ప అస్వస్థత గురయ్యారు.. ఆయనను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు పోలీసులు. పోసాని కృష్ణ మురళికి అక్కడి వైద్యులు ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. ఈసీజీ పరీక్షలలో ఆయన ఆరోగ్యంలో స్వల్ప తేడా ఉన్నట్లుగా గుర్తించారు వైద్యులు. మెరుగైన వైద్యం కోసం కడపకు తరలించే అవకాశం కనిపిస్తోంది.
కాగా, కులాలు, వర్గాలపై గత ఏడాది పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యల మీద ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఓబులవారిపల్లె పోలీసులు కేసు నమోదు చేసి తాజాగా ఆయనను అరెస్ట్ చేశారు. ఆయనను అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు కోర్టులో హాజరు పరిస్తే కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలోనే రాజంపేట సబ్ జైల్లో మార్చి 12వ తేదీ వరకు పోసాని కృష్ణమురళి రిమాండ్ ఖైదీగా ఉండాల్సి ఉంది.