AP Government | పేదలకు అండగా..

AP Government | పేదలకు అండగా..
AP Government, గన్నవరం, ఆంధ్రప్రభ : పేదల పక్షాన కూటమి ప్రభుత్వం నిలుస్తుందని మరోసారి నిరూపిస్తూ, ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా లబ్ధిదారులకు భరోసా కల్పించారు. మంగళవారం రాత్రి గన్నవరం నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 37 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు స్వయంగా అందజేశారు.
గన్నవరం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆరోగ్య చికిత్సలు వంటి అత్యవసర పరిస్థితుల్లో పేద కుటుంబాలకు ఈ సహాయం పెద్ద ఊరటనిస్తుందన్నారు. ప్రజల కష్టసుఖాల్లో ప్రభుత్వమే ముందుండి అండగా నిలవాలన్న లక్ష్యంతో సీఎం సహాయనిధిని పారదర్శకంగా, వేగంగా అందజేస్తున్నామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేస్తూ, అవసరమైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
