ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. యువతలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అధునాతన సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో మైక్రోసాఫ్ట్, ఏపీఎస్‌ఎస్‌డీ అవగాహన ఒప్పందం చేసుకున్నాయి.
ఇందులో భాగంగా ఏడాది వ్యవధిలో 2 లక్షల మంది యువతకు కృత్రిమ మేధస్సు, అధునాతన సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించేందుకు శిక్షణ ఇవ్వనున్నారు. దీంతో యువతక ఐటీ ఆధారిత కంపెనీల్లో ఉపాది అవకాశాలు పెరుగుతాయిని అధికారులు తెలిపారు.
మరోవైపు విద్యాసంస్థల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠాలను ప్రవేశపెట్టేందుకు అవసరమైన శిక్షణ, సర్టిఫికేషన్ మైక్రోసాఫ్ట్ అందిస్తుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు.