AP | లారీ ఢీకొని తండ్రి, కూతురు మృతి..

కర్నూల్ బ్యూరో : ఆలూరు మండలంలో విషాద ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. పెద్దహోతూరు సమీపంలో లారీ ఢీకొని ఆస్పరి మండలం ముత్తుకూరుకు చెందిన తండ్రి వడ్డె ఈరన్న, కూతురు శ్రావణి అక్కడికక్కడే మృతి చెందారు.

శ్రావణి చిప్పగిరిలోని కేజీబీవీ స్కూల్‌లో 9వ తరగతి చదువుతోంది. అయితే, పాఠశాలకు సెలవు దినాలు కావడంతో శ్రావణి తండ్రి ఈరన్న ఆమెను తన మోటార్‌సైకిల్‌పై తీసుకెళ్తుండగా ఈ ప్ర‌మాదం జరిగింది.

Leave a Reply