- ముగ్గురు అన్నదమ్ములు మృతి
ములకలచెరువు (అన్నమయ్య జిల్లా), ఆంధ్రప్రభ : అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువు సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి పెద్దపాలెం ఫ్లైఓవర్ బ్రిడ్జిపై జరిగిన ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
ములకలచెరువు ఎస్ఐ నరసింహుడు తెలిపిన వివరాల ప్రకారం —
మండలంలోని వేపూరికోట పంచాయతీ పరిధిలోని కూటగులోల్లపల్లికి చెందిన వెంకటేష్, తరుణ్, మనోజ్ లు ఒక ద్విచక్ర వాహనంపై ములకలచెరువుకు వెళ్లి తిరిగి వస్తుండగా, పెద్దపాలెం ఫ్లైఓవర్ వద్ద ఆర్టీసీ బస్సు వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఘటన తీవ్రతతో ముగ్గురు అన్నదమ్ములు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఒకే కుటుంబంలో ముగ్గురు యువకుల మరణం వారి తల్లిదండ్రులను విషాదంలో ముంచెసింది.