AP Deputy CM | పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కు ప్రమాదం

AP Deputy CM | పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కు ప్రమాదం

AP Deputy CM | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్‌ (Pawan Kalyan) కు తృటిలో ప్రమాదం తప్పింది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విశాఖపట్నం పర్యటనలో ఉన్నారు. ఇవాళ‌ ఉదయం ఆయనను పికప్ చేసుకోవడానికి కాన్వాయ్ వాహనాలు విశాఖలోని సిరిపురం నుంచి పెద్దవాల్తేరు వైపు వెళ్తున్నాయి. ఈ క్రమంలో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో కాన్వాయ్‌లోని ఒక వాహనం అకస్మాత్తుగా సడన్ బ్రేక్ వేయడంతో, వెనుక వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కాన్వాయ్‌లోని చివరి వాహనం ముందు భాగం స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం.

Leave a Reply