ఏపీ కలెక్టర్ల సదస్సు ప్రారంభం


( ఆంధ్రప్రభ, వెలగపూడి ప్రతినిధి): ప్రభుత్వ పాలసీలు, అభివృద్ధి, ఎదురయ్యే సవాళ్లు తదితర అంశాలపై సమీక్ష ఎజెండాతో వెలగపూడిలోని సచివాలయంలో కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధ్యక్షతన సచివాలయం 5వ బ్లాక్ లో ప్రారంభమైన ఈ సదస్సు రెండు రోజులు జరుగుతుంది. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హాజరయ్యారు. వ్యవసాయం(agriculture), విద్య(education), వైద్యం(medicine), పర్యాటకం(tourism), పీ-4, సూపర్ సిక్స్, పరిశ్రమలపై చర్చ సాగుతుంది. శాఖల అధికారుల ప్రజెంటేషన్లు.. మొత్తం 8 అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష జరుపుతారు.

ఈ సందర్భంగా సీఎస్ కె. విజయానంద్(Vijayanand) మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి, పెట్టుబడులకు 23 పాలసీల(23 policies)ను ప్రభుత్వం అమలు చేస్తోంది. జీఎస్డీపీ అభివృద్ధితో పాటు విజన్ తదితర అంశాలపై కలెక్టర్లు(Collectors) దృష్టి సారించాలి. ప్రజల నుంచి వచ్చిన 10.45 లక్షల గ్రీవెన్సులను కూడా ఇప్పటికే పరిష్కరించాం, ఆర్థికాభివృద్ధి, ఉపాధి, ఉద్యోగాల కల్పనతో పాటు సమగ్ర అభివృద్ధిపై కలెక్టర్లు దృష్టి సారించాలి, అని అన్నారు.

Leave a Reply