కాశీబుగ్గ దుర్ఘటనపై ఏపీ సీఎం ఆగ్రహం
(శ్రీ సత్యసాయి జిల్లా బ్యూరో, ఆంధ్రప్రభ ) : కాశీబుగ్గ దుర్ఘటనకు కారకులెవరో గుర్తించండి. తక్షణమే అరెస్టు చేయండి. అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సత్యసాయి జిల్లాలో సామాజిక పెన్షన్ల పంపిణీకి వెళ్లిన సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) కాశీబుగ్గ దుర్ఘటనసై స్పందించారు. శ్రీకాకుళం అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. ఈ దుర్ఘటనకు కారణాలేంటీ? న్రమాదం ఎలా జరిగింది. కారకులెవరో గుర్తించాలని అధికారులను ఆదేశించారు.

