AP CM | ప్రజల మంచి కోసం..

AP CM | ప్రజల మంచి కోసం..
AP CM | గుడివాడ, ఆంధ్రప్రభ : నిరంతరం ప్రజల మంచి కోసం ఆలోచించే సీఎం చంద్రబాబు.. ప్రజల సంక్షేమానికి అనేక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. కొత్త సంవత్సరంలో గుడివాడలో మరిన్ని మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. గుడివాడ పట్టణం 16, 18 వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము బుధవారం ఉదయం పాల్గొన్నారు. నూతనంగా మంజూరైన పెన్షన్లతో పాటుగా పలువురు లబ్ధిదారులను ఆత్మీయంగా పలకరిస్తూ ఎమ్మెల్యే రాము ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నగదును పంపిణీ చేశారు.
నూతన పెన్షన్ నగదు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే రాము, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడారు.. సీఎం చంద్రబాబు ప్రణాళిక ప్రకారం.. కొత్త పెన్షన్ల మంజూరును నిరంతర ప్రక్రియగా చేయడమే కాకుండా, వితంతు పెన్షన్లు ప్రక్రియను సులభతరం చేశారన్నారు. గొప్ప ఆలోచనలతో సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచిస్తూ అనేక మంచి పనులు చేస్తుందన్నారు. కార్యాలయాల్లో కూర్చొని చట్టాలు చేయడం కాదు.. ప్రజల మధ్య ఉంటూ.. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం వారిని ఆదుకోవాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా గుడివాడ నియోజకవర్గంలో పర్యటిస్తున్నానని పేర్కొన్నారు.
గుడివాడ అభివృద్ధికి ప్రజలు ఇస్తున్న మద్దతు చూస్తుంటే.. నాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరూ కొత్త సంవత్సర వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే రాము ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్ ఎస్ మనోహర్, టీడీపీ నాయకులు డాక్టర్ గోర్జి సత్యనారాయణ, చేకూరు జగన్మోహన్రావు, యార్లగడ్డ సుధారాణి, అల్లాడ శ్రీనివాస్, కంచర్ల సుధాకర్, ఇమ్మానుయేలు, గూడూరు సురేంద్ర, జనసేన నాయకులు గుండు వెంకట్రావు, మొగసాల శ్రీను, గణపతి రమేష్, ద్రోణాదుల కుమార్, సచివాలయ ఉద్యోగులు, మున్సిపల్ సిబ్బంది, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.
