AP CM | భక్తుల సౌకర్యార్థం ప్ర‌త్యేక రైలు

AP CM | భక్తుల సౌకర్యార్థం ప్ర‌త్యేక రైలు

అజ్మీర్ ట్రైన్ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ హసీమ్ బేగ్

AP CM | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మచిలీపట్నం నుండి అజ్మీర్‌కు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైలును ఏర్పాటు చేసినందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడుకి, మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యులు బాలశౌరి వల్లభనేనికి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావుకి ఏపీ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ హసీమ్ బేగ్ కృతజ్ఞతలు తెలియజేశారు. అజ్మీర్ షరీఫ్ ఉర్స్ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తుల రాక‌పోక‌ల నేప‌థ్యంలో ఈ ప్రత్యేక రైలును ఏర్పాటు చేయడం ప్రశంసనీయమ‌న్నారు. ఈ సౌకర్యం వల్ల వేలాది మంది భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం లభించనుంది. ఈ కార్యక్రమంలో జామియా మసీదు ప్రెసిడెంట్ భాషా, సయ్యద్ ఖాజా, ఫిరోజ్ గారు, బాజాని, అజీమ్, ఖాదర్, గడ్డం రాజు, పాషి మరియు కూటమి మైనార్టీలు పాల్గొన్నారు.

Leave a Reply