AP CM | నారా చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం..

AP CM | నారా చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం..

AP CM |ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. పవన్ ఇవాళ ఉదయం సీఎం నివాసానికి చేరుకున్నారు. అనంతరం ఇద్దరి మధ్య సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, సున్నితమైన అంశాలపై విపక్షం రెచ్చగొట్టే ప్రయత్నాలు, తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే రాజ్యసభ ఎన్నికలు, నియామక పదవులు, కూటమి పక్షాల సమన్వయం, వైసీపీ విషప్రచారాన్ని తిప్పికొట్టడంపై చర్చించనున్నట్లు సమాచారం.

Leave a Reply