AP CM | ఇజ్రాయెల్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ

AP CM | ఇజ్రాయెల్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ
AP CM | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో ఉన్నారు. సైబర్ సెక్యూరిటీ నగరంగా రాజధాని అమరావతిని తీర్చిదిద్దేందుకు సాంకేతిక సహకారం అందించాలని సీఎం చంద్రబాబు ఇజ్రాయెల్ ప్రతినిధులను కోరారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా దావోస్‌లో ఉన్న సీఎం.. ఇజ్రాయెల్ వాణిజ్య, పరిశ్రమల మంత్రి నిర్ బర్కత్, ఆ దేశ ట్రేడ్ కమిషనర్ రోయ్ పిషర్‌తో సమావేశమయ్యారు.
