కుప్పం | నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం (alliance) సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి నేటి నుంచి శ్రీకారం చుట్టనుంది .. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
వృద్ధాప్య పెన్షన్, (pension ) తల్లికి వందనం, (talliki vandanam) దీపం ( deepam) పథకం ద్వారా ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ( gas cylinder) అందిస్తోంది. ఈ విషయాలను ప్రభుత్వ ప్రజలకు వివరించనుంది.
ఇక వచ్చే ఆగష్టు 15 నుంచి మహిళలకు ఉచిత ఆర్టీస బస్సు ప్రయాణం కల్పించనుంది. దీన్ని కూడా మహిళలకు వివరించనున్నారు. అలాగే అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల కోసం రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం చేయనుంది. దీన్ని కూడా కూటమి నేతలు వివరించనున్నారు. నెరవేర్చిన సూపర్ సిక్స్ హామీలతో పాటు ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను తెలియజేయనున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతో జరిగిన అభివృద్ధిపై ఇంటింటికి తిరిగి కూటమి నేతలు వివరించనున్నారు.
ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు. రెండు రోజుల పాటు కుప్పంలో పర్యటన కొనసాగనుంది. బుధవారం మధ్యాహ్నం 12:30 గంటలకు శాంతిపురం మండలంలోని తుమిసిలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు చంద్రబాబు చేరుకుంటారు. మధ్యాహ్నం 12:50 గంటలకు శాంతిపురం మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ దగ్గరకు రోడ్డు మార్గాన చేరుకుంటారు. మధ్యాహ్నం 1:30 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఇక సాయంత్రం 4:35 గంటలకు తిమ్మరాజుపల్లిలో సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ఏడాదిగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమంపై ప్రజలకు వివరించనున్నారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్‌లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఇక రాత్రి 7:05 గం.లకు శాంతిపురం మండలంలోని సొంత ఇంటికి వెళ్లనున్నారు. రాత్రికి శివపురంలో ఉన్న ఇంట్లో బస చేయనున్నారు.
రెండో రోజు సీఎం పర్యటన వివరాలు..ఇక గురువారం ఉదయం 10:35 గంటలకు కుప్పం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లనున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో టాటా డీఐఎన్సీ సెంటర్‌ను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12:15 గంటల నుంచి అధికారులతో సమావేశం కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 2:30 గంటలకు పార్టీ ముఖ్య నాయకులతో భేటీ అవుతారు. సాయంత్రం 4:10 గంటలకు హెలిపాడ్ నుంచి తిరుగుప్రయాణం అవుతారు.