అమరావతి : జనసేన పార్టీ అధినేత, ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదైంది. జనసేన పార్టీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత నెల 18వ తేదీన కేసు నమోదు చేశారు. దీంతో 41ఏ కింద కేసు నమోదు చేయాలని నోటీసులిచ్చారు.
ఇందులో తమ విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. దీంతో ఆయన తన అనుచరురాలు దివ్వెల మాధురితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ప్రస్తుతం ఆయనను టెక్కలి పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు ఎందుకు చేశారు ? మీ వ్యాఖ్యల వెనుక వైసీపీ కీలక నేతల ప్రోద్బలం ఉందా ? అనే కోణంలో పోలీసులు ప్రశ్నిస్తున్నారు.