AP| నేడు చంద్రబాబు కేబినెట్ భేటీ
అమరావతి – నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ రోజు(గురువారం) ఏపీ మంత్రివర్గ భేటీ జరగనుంది. రాష్ట్రంలో పెట్టుబడులు.. సంక్షేమ పథకాల అమలు తో పాటుగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ పైన నిర్ణయం తీసుకోనున్నారు.
ఉన్నత విద్యా మండలి.. సాంకేతిక విద్య లో మార్పులు.. సంస్కరణల పైన చర్చించనుంది. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండటంతో జిల్లా ఇంఛార్జ్ మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక దిశా నిర్దేశం చేయనున్నారు.ప్రతిపాదనలకు ఆమోదంఈ రోజు జరిగే మంత్రివర్గ భేటీలో పలు ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేయనున్నారు.
ఇప్పటికే పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆమోదం తెలిపిన పరిశ్రమలకు భూ కేటాయింపు లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ పైన మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది.
ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఆదాయం పెంపు మార్గాల పైన తమ శాఖల్లో ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని మంత్రుల కు సీఎం సూచించే అవకాశం ఉంది.
ఎస్ఐబీపీ సమావేశంలో 15 ప్రాజెక్టులకు అమోదం తెలిపారు. రూ 44,776 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన పరిశ్రమలకు భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది
కీలక నిర్ణయాలు
రాష్ట్రంలో పెరిగిన భూముల విలువ రిజిస్ట్రేషన్ ఛార్జీలకు కేబినెట్ ఆమోదం తెలిపనుంది. ఇక, రాష్ట్రంలో విద్యా సంస్కరణల్లో భాగంగా ఉన్నత విద్యామండలికి ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటు చేసే అంశం కేబినెట్ ముందుకు రానుంది. ప్రస్తుతం ఉన్న ఉన్నత విద్యా మండలిని రానున్న రోజుల్లో కేవలం ప్రవేశ పరీక్షలకు మాత్రమే పరిమితం చేయనున్నారు.
ఉగాది నుంచి స్వర్ణాంధ్ర విజనం -2047 లో భాగంగా పీ4 విధానం అమలు పైన మంత్రివర్గంలో చర్చించనున్నారు. ఇక, 22A, ఫ్రీ హోల్డ్ భూముల అంశంపై మంత్రివర్గానికి స్టేటస్ నోట్‌ను ఆయా జిల్లాల ఇంఛార్జ్ మంత్రులు ఇవ్వనున్నారు. ఈ భూముల వ్యవహారం పైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
వైసీపీ హయాంలో అవినీతి ఆరోపణల పైన విచారణ పైన నిర్ణయం తీసుకోనున్నారు.పథకాల అమలుఇక, సంక్షేమ పథకాల అమలు పైన ఈ భేటీలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు రూ 20 వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. కేంద్రం పీఎం కిసాన్ కింద అందిస్తున్న రూ 6 వేలకు రూ 14 వేలు కలిపి మూడు విడత లుకా రైతులకు రూ 20 వేల నిధులు అందేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది.
నేటి భేటీ లో ఈ నిధుల విడుదల తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది. అదే విధంగా ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం .. జూన్ లో అమ్మఒడి అమలుకు నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక.. ఉద్యోగాల భర్తీ పైన నిర్ణయం ఉండే అవకాశం కనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఇంఛార్జ్ మంత్రులకు బాధ్యతల విషయంలోనూ సీఎం బాధ్యతలను ఖరారు చేయనున్నారు.