ఇంద్రకీలాద్రి కి తీసుకు వచ్చిన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్..
అమ్మవారికి ప్రత్యేక పూజలు
( ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో ) : కూటమి ప్రభుత్వం ఈ ఏడాది ప్రవేశపెట్టిన రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రతులను కనకదుర్గమ్మ పాదాల చెంత ఉంచారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో 2025-26 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్ సమగ్ర నివేదికను రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ శుక్రవారం కనకదుర్గమ్మ సన్నిధికి తీసుకువచ్చారు.
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంకు శుక్రవారం వచ్చిన రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ కు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ ఉప కార్యనిర్వహణ అధికారి ఎం.రత్నరాజు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.