తిరుపతి లడ్డూకల్తీ మంటలు

తిరుపతి లడ్డూ కల్తీ మంటలు
ఇందాపూర్ సంగతేంటి?
• ఎందాకైనా పోరాడతాం
• హెరిటేజ్ దే ఆ సంస్థ
• వెబ్సైట్లో స్పష్టంగా ఉంది
• మండలి విపక్షనేత బొత్స
అమరావతి, ఆంధ్రప్రభ : సభను సజావు గా సాగనివ్వకుండా అంతరాయం కలిగించడం విపక్షానికి అలవాటైపోయింది. ఈరోజు హెరిటేజ్ సంస్థపై ఆరోపణలు చేస్తున్నారు. ఇది సరైన పద్ధతికాదు. అంతగా అవసరమైతే ఆధారాలతో రండి.. నిజానిజాలు తేల్చుకుందాం అంటూ వ్యవ సాయ శాఖమంత్రి కె. అచ్చెన్నాయుడు శాసన మండలిలో ప్రతిపక్ష సభ్యులకు సవాల్ విసిరారు. మంగళవారం మధ్యాహ్నం వాయిదా తీర్మానంపై వైఎస్సార్సీపీ సభ్యులు పట్టు బట్టగా అందుకు చైర్మన్ మోషేన్ రాజు తిరస్కరించారు. దీంతో హెరిటేజ్ ఉత్పత్తులు కల్తీ అంటూ నినాదాలు చేస్తూ చైర్మన్ వెల్లోకి దూసుకెళ్లారు. అనంతరం పోడియంను చుట్టుముటారు. ఓవైపు ఎమ్మెల్సీ రెడ్డి ఒప్పుకున్నారు.
ఆ వాస్తవాన్ని దాచిపెట్టి, సిగ్గుపడాల్సింది పోయి ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై ఎదురు దాడి చేయడం, సంబంధం లేని హెరిటేజ్ సంస్థపై ఆరోపణలు అంటగట్టడం దారుణమని అసహనం వ్యక్తంచేశారు. హిందూ సంప్రదాయా లపై మాట్లాడే నైతిక హక్కు ఆపార్టీకి లేదని ధ్వజమెత్తారు.
వెల్లోకి ఇరుపక్షాలు
వాయిదా అనంతరం మధ్యాహ్నం 12.50 నిమిషాలకు తిరిగి సభ ప్రారంభమైన వెంటనే విపక్ష సభ్యులు మరోసారి నినాదాల బాటపట్టారు. ఓవైపు మంత్రి అచ్చెన్నాయుడు, మరో వైపు మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఎవరికి వారే తమదైన ధోరణిలో ప్రసంగించడం మొదలెట్టా రు.
ఇంకోవైపు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు నినాదాలు కొనసా
గించడంతో, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు సైతం చైర్మన్ వెల్లోకి వెళ్లారు. ఆయనకు అధికార పక్ష సభ్యులు జతకట్టారు. అటు విపక్షసభ్యులు, ఇటు అధికార పక్ష సభ్యుల ఆందోళనల నడుమ సభలో కొన్ని నిమి షాలపాటు గందర గోళం నెలకొంది. ఎవరేం మాట్లాడుతున్నారో అర్థం కాని పరి స్థితి ఏర్పడింది.
చైర్మన్ మోషన్ రాజు ఎంత వారించినప్పటికీ ప్రయో జనం లేకపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి, రెండు చైతులూ పైకెత్తి నమస్కరిస్తూ వెళ్లిపోయారు. మిగతా వార్త చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
