AP Assembly | విద్యుత్ సంస్క‌ర‌ణ‌ల‌కు ఆదిమూలం నేనే… చంద్రబాబు

విద్యుత్ రంగంలో మార్పుల‌కు 1998 లోనే శ్రీకారం
దాని ఫ‌లిత‌మే నాణ్య‌మైన‌,కోత‌లు లేని విద్యుత్ ఉత్ప‌త్తి
ఇంధ‌న శాఖ చ‌ర్చ‌లో చంద్ర‌బాబు వెల్ల‌డి..

వెల‌గ‌పూడి : విద్యుత్ రంగంలో తొలి సంస్కరణలు తీసుకొచ్చింది టిడిపి ప్రభుత్వమేనని సీఎం చంద్రబాబు అన్నారు. శాసనసభ లో నేడు ఇంధన శాఖపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, “1988లో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చాం. డిస్ట్రిబ్యూషన్, జనరేషన్, ట్రాన్స్మిషన్గా విభజించాం. ఎనర్జీ ఆడిటింగ్ తీసుకొచ్చాం. కరెంట్ కొరత లేని ఏకైక రాష్ట్రంగా ఏపీని తయారు చేశాం. ఆనాడు తీసుకొచ్చిన సంస్కరణల ఫలితాలను చూసి సంతోషించాం. వ్యవసాయానికి యూనిటు వసూలు చేసే పరిస్థితి నుంచి శ్లాబ్ రేటుతో రైతులను ఆదుకుంది టిడిపి ప్రభుత్వమే. 2014లో రాష్ట్రంలో 22.5 మిలియన్ యూనిట్ల కరెంట్ కొరత ఉండేది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో దాన్ని సవాల్గా తీసుకున్నాను. 2014 డిసెంబర్కు ఎక్కడా కరెంట్ కొరత లేకుండా చేసి.. జనవరి 2018 నాటికి మిగులు విద్యుత్ సాధించిన రాష్ట్రంగా మార్చానని వెల్ల‌డించారు.

ఇప్పుడు గర్వంగా చెబుతున్నా.. 9 గంటలు వ్యవసాయానికి కరెంట్ ఇస్తున్నాం. నేను 1995లో మొదటిసారి సీఎం అయ్యేసరికి 10 నుంచి 15 గంటల పాటు కరెంట్ కోతలుండేవి. పరిపాలన ఎలా ఉండాలో ఆలోచించా.. అందుకు అనుగుణంగా ప్రణాళికలతో ముందుకెళ్లా. మీటర్ రీడింగ్ కోసం స్పాట్ బిల్లింగ్ తీసుకొచ్చాం. ప్రపంచం మొత్తం అధ్యయనం చేశా.. ప్రపంచ బ్యాంకు జీతగాడు అని నాపై విమర్శలు చేశారు” అని చంద్రబాబు అన్నారు.

పాస్ పుస్తకాల చట్ట సవరణకు అసెంబ్లీ ఆమోదం

ఏపీ భూ హక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాల చట్ట సవరణకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.. అప్పిలేట్ అథారిటీని జిల్లా రెవెన్యూ అధికారుల నుంచి ఆర్డీవోలకు మారుస్తూ చట్టసవరణ చేశారు… చట్టసవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్ర‌వేశ‌పెట్టారు.. స్వ‌ల్ప చ‌ర్చ అనంత‌రం ఈ బిల్లును స‌భ ఆమోదించింది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *