AP | విశాఖకు భారీ ఐటీ సంస్థ.. 10 వేల ఉద్యోగాలతో ఏఎన్ఎస్ఆర్ క్యాంపస్

విశాఖలో ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ ఏర్పాటు
ఏపీ ప్రభుత్వంతో కీలక అవగాహన ఒప్పందం
మధురవాడ ఐటీ క్లస్టర్‌లో అత్యాధునిక క్యాంపస్ నిర్మాణం
విశాఖను జీసీసీ రాజధానిగా మారుస్తామన్న మంత్రి లోకేశ్
రాష్ట్రానికి టాప్-100 ఐటీ కంపెనీలను రప్పిస్తామని వెల్లడి

వెలగపూడి, ఆంధ్రప్రభ : (velagapudi, andhra prabha )

ఏపీని (ap ) పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యంలో మరో కీలక ముందడుగు పడింది. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల అభివృద్ధికి ఊతమిస్తూ, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల (జీసీసీ) ఏర్పాటులో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఏఎన్ఎస్ఆర్ (ansr) సంస్థ విశాఖపట్నంలో (visakhapatnam) భారీ క్యాంపస్ (campus ) ఏర్పాటుకు ముందుకొచ్చింది. మధురవాడ ఐటీ క్లస్టర్‌లో (madurawada it cluster ) అత్యాధునిక జీసీసీ ఇన్నోవేషన్ క్యాంపస్‌ను (Icc Innovation, స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా రానున్న ఐదేళ్లలో 10,000 మందికి పైగా నాణ్యమైన ఉద్యోగాలు లభించనున్నాయి.


మంత్రి నారా లోకేశ్ సమక్షంలో నేడు ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా ఏఎన్ఎస్ఆర్ సంస్థ సీఈఓ లలిత్ అహూజా మాట్లాడుతూ, “ప్రపంచ స్థాయి ప్రతిభ, బలమైన మౌలిక సదుపాయాలు, దార్శనిక నాయకత్వం వంటివి విశాఖలో మేళవించి ఉన్నాయి. ఇవి అద్భుతాలు సృష్టించేందుకు దోహదపడతాయి. మా ఇన్నోవేషన్ క్యాంపస్ ప్రపంచంలోని ప్రతిష్ఠాత్మక సంస్థలకు విశాఖను ఒక ప్రధాన గమ్యస్థానంగా మారుస్తుంది” అని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిభావంతులను ప్రపంచ స్థాయి కంపెనీలతో అనుసంధానించడంలో తమ సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు.

Leave a Reply