AP | అడవుల పెంపకానికి కొత్త సలహాదారుడిగా అంకారావు !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కే.అంకారావును (Komera Ankarao) అడవుల పెంపక సలహాదారుడిగా నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.ఎస్. విజయానంద్ (K.S. Vijayanand) అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

ఇప్పుడు ఆయన్ను రెండు సంవత్సరాల కాలానికి అడవుల పెంపకానికి సంబంధించిన ప్రత్యేక సలహాదారుడిగా (Special Adviser) నియమించడం జరిగింది.

పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన అంకారావు పేద వ్యవసాయ కుటుంబంలో పుట్టి, తన జీవితాన్ని ప్రకృతి, అడవుల సంరక్షణకు అంకితం చేసుకున్న వ్యక్తి. దూర విద్య ద్వారా డిగ్రీ, పీజీ పూర్తిచేసినా, ఉద్యోగాన్ని కాకుండా అడవుల సేవనే జీవనంగా ఎంచుకున్నారు.

ప్రతి రోజు నల్లమల అడవిలో ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగిస్తూ, చెరువులను శుభ్రపరుస్తూ, పక్షులకు గింజలు వేస్తూ, ప్రకృతిని పరిరక్షిస్తున్నారు. తన పొలంలో పంట పంచుకుంటూ, “పక్షులు ఉంటేనే అడవి, అడవి ఉంటేనే వాన” అనే నమ్మకంతో జీవిస్తున్నారు. అడవిలో మొక్కల ఔషధ గుణాలు, పర్యావరణ విద్యను పిల్లలకు బోధిస్తూ “వన మూలికా నిపుణుడు”గా గుర్తింపు పొందారు.

అయితే, ప్రపంచపర్యావరణ దినోత్సవం (జూన్‌ 5, 2025) సందర్భంగా అమరావతిలో ఏర్పాటయిన కార్యక్రమంలో పాల్గొన్న అంకారావు త‌న‌ ప్రసంగం సీఎం చంద్రబాబును ఆకట్టుకున్నాడు.

అడవుల అంతరించిపోవడాన్ని, ప్రకృతికి, పువ్వులు వికసించడానికి మధ్య ఉన్న సంబంధాన్ని వివరిస్తూ వేదికపై అనర్గళంగా ఉపన్యాసాలు ఇస్తున్న అంకారావు వైపు సీఎం చంద్రబాబు ప్రశంసాపూర్వకంగా చూశారు. అంకారావు ను అదే వేదికపై రాష్ట్ర ప్రభుత్వ అడవుల పరిరక్షణ సలహాదారుగా నియమించారు.

Leave a Reply