AP Allocations | కేంద్ర బడ్జెట్ లో ఎపి కేటాయింపులు ఇవే…
వెలగపూడి – 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో ఏపీకి పలు కేటాయింపులు చేశారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్ కి ప్రాధాన్యతనిచ్చారు.
2025-26 ఆర్థిక బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు
పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు
విశాఖ స్టీల్‌కు రూ.3,295 కోట్లు
విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు
జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కి రూ. 186 కోట్లు
ఏపీ ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి రూ. 162 కోట్లు
లెర్నింగ్ ట్రాన్స్ఫార్మేషన్ ఆపరేషన్ కి మద్దతుగా రూ. 375 కోట్లు
ఏపీలో రోడ్లు, వంతెనల ప్రాజెక్టుకు రూ.240 కోట్లు
ఏపీ ఇరిగేషన్, లైవ్లీ హుడ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్టు 2వ దశకు రూ.242.50 కోట్లు
గత ఏడు నెలల్లో కేంద్రం నుంచి..
ఏపీలో వివిధ ప్రాజెక్టులకు వచ్చిన నిధులు వివరాలు
అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్లు
విశాఖ స్టీల్ ప్లాంట్‌కి రూ.11,440 కోట్లు
నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్‌కి రూ.14 వేల కోట్లు
వెనుకబడిన జిల్లాలకు రూ. 1,750 కోట్లు
గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు రూ.1.8లక్షల కోట్లు
పోలవరం ప్రాజెక్టుకు రూ.2,800 కోట్లు
పారిశ్రామిక కారిడార్లకు రూ.4,936 కోట్లు
BPCL రిఫైనరీకి రూ.95వేల కోట్లు