AP | 50 వేల శివలింగాలు సమర్పణ..

AP | 50 వేల శివలింగాలు సమర్పణ..
AP | ఘంటసాల, ఆంధ్రప్రభ : మహాశివరాత్రి పర్వదినాన అహోరాత్ర కోటి పార్ధవ లింగార్చన మహా జాగరణ మహోత్సవ సందర్భంగా కృష్ణా జిల్లా ఘంటసాల గ్రామంలో తయారు చేసిన శివలింగాలు తాళ్లాయపాలెం శైవక్షేత్రంలో సోమవారం కైలాసగిరి స్వామివారికి 50 వేల శివలింగాలు సమర్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో అందె జగదీష్ సూర్య భవాని దంపతులు, జంజనం రామ్మోహన్ రావు దంపతులు, పొత్తూరి లక్ష్మి, కాగితపు సీతామహాలక్ష్మి, దివి రత్నకుమారి, తుమ్మలచెర్ల అరుణకుమారి, నందం వెంకటసుబ్బమ్మ, తుమ్మలచెర్ల వీర వెంకటేశ్వరమ్మ, తుమ్మలచెర్ల రామలక్ష్మి తదితరులు పాల్గొని కైలాసగిరి క్షేత్రంలో స్వామి వారికి విశేష పూజలు చేసి శివలింగాలు సమర్పించినారు.
