AP | మెడికో మృతి

AP | వెబ్ డెస్క్, ఆంధ్ర‌ప్ర‌భ : లారీని కారు ఢీకొనడంతో మెడికో మృతిచెందగా, మరో ముగ్గురికి గాయాలైన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని రాజానగరం జాతీయ రహదారిపై లారీని జీఎస్ఎల్ మెడికల్ కాలేజీ విద్యార్థుల కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మెడికో లిఖిత మృతిచెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Leave a Reply