AP | రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

AP | రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

  • పుచ్చగడ్డ శివారులో జరిగిన ప్రమాదం

AP | ఘంటసాల, ఆంధ్రప్రభ : ఘంటసాల రామానగరం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలైన సంఘటన శనివారం ఉదయం జరిగింది. చల్లపల్లి నుంచి ఘంటసాల వస్తున్న కారును పుచ్చగడ్డ దాటిన తర్వాత యువకులు ఇద్దరు ప్రయాణిస్తున్న బైక్ ఢీకొట్టడంతో ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయింది. బైక్ కూడా ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. కారులో భార్యాభర్తలతోపాటు కుమారుడు ఉండగా, చిన్నారికి గాయాలయ్యాయి. బైక్ పై ఉన్న దేవరకోట గ్రామానికి చెందిన ఇరువురి యువకులు కూడా గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మంచు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు గాయపడిన యువకులు తెలిపారు.

Leave a Reply