AP | అన్నా క్యాంటీన్లో ఆహారాలు రుచికరంగా ఉన్నాయా?..

AP | అన్నా క్యాంటీన్లో ఆహారాలు రుచికరంగా ఉన్నాయా?..
ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్…
AP | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలోని అన్న క్యాంటీన్లను జిల్లా కలెక్టర్ రాజకుమారి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆహార పరిశుభ్రత గురించి అడిగి తెలుసుకున్నారు. భోజనం చేసే వారిని అడిగి ఆహార పదార్థాలు ఎలా ఉన్నాయంటూ ప్రశ్నించారు. ఐదు రూపాయలకు అన్నం కడుపునిండా తినడం పేదవాడికి ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. వంట పాత్రలను పరిశీలించారు. భోజనాన్ని రుచి చూశారు. వంట చేసే వారి తో సమస్యలన్నీ అడిగి తెలుసుకున్నారు. వచ్చినవారికి పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం సరఫరా చేయాలని వంట వారిని ఆదేశించారు. అటెండెన్స్ రిజిస్టర్లలో టిఫిన్ ఎంతమంది తింటున్నారు, భోజనం ఎంతమంది తింటున్నారు అన్న వివరాలను ఆరాతీశారు. మొత్తానికి అన్న క్యాంటీన్లలో సంతృప్తికరంగా ఉందని ఆమె వ్యక్తం చేయడం విశేషం. ఆమె వెంట పలువురు పాల్గొన్నారు.
