8 మంది పట్టివేత

8 మంది పట్టివేత
- వైసీపీ నేతే టీమ్ లీడర్
- ఇద్దరు ముసుగు స్వాములు సహా ఆరుగురు పరారీ
- చిత్తూరు జిల్లాలో సంచలనం
పెద్దపంజాణి, ఆంధ్రప్రభ : చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాణి మండలంలోని వీరప్పల్లి అడవిలో అర్ధరాత్రి గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతుండగా పోలీసులు మెరుపు దాడి చేసి 8 మందిని అరెస్టు చేసిన ఘటన శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
పోలీసుల వివరాల మేరకు…. వీరప్పల్లి పంచాయతీ కెలవతి గ్రామానికి చెందిన ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎర్రబెల్లి శ్రీనివాసులు అతని తమ్ముడు శరవణ గుప్తనిధుల తవ్వకానికి పన్నాగం పండి పుంగునూరు కి చెందిన అంబికా స్వామి తో సంప్రదించి పూజలు జరిగి గుప్తనిధుల తవ్వకానికి స్థలాన్ని గుర్తించి వాటికి కావలసిన జేసీబీని జనాన్ని జమ కూర్చుకున్నారు.
ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి గుప్త నిధుల స్థలం వద్ద పూజలు జరుపుతుండగా పోలీసులకు సమాచారం అందడంతో పలమనేరు అర్బన్ సీఐ మురళీమోహన్, గంగవరం రూరల్ సీఐ పురుషోత్తం ఆదేశాల మేరకు ఎస్సై లోకేష్ రెడ్డి, పంజాని పి ఎస్ ఐ మారప్ప దాడులు చేయగా వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రబెల్లి శ్రీనివాసులు అతని తమ్ముడు శరవణతో పాటు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.
ఆ 8 మంది అరెస్టు
పలమనేని నియోజకవర్గంలోని పెద్దపంజాణి మండలం కలవాతి గ్రామ సమీప ప్రాంతాల్లో గుప్త నిధులు తవ్వకాలు జరుపుతున్న ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కలవాతి గ్రామానికి చెందిన కృష్ణప్పకుమారుడు వై శ్రీనివాసులు (50) , కృష్ణప్ప కుమారుడు సరవణ (43) , లక్ష్మయ్య కుమారుడు బి ప్రకాష్ (47), సుబ్బారెడ్డి కుమారుడు శ్రీనివాసులు రెడ్డి (34), త్యాగరాజులు కుమారుడు కే రమేష్ (30) అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.
తలవాతి గ్రామానికి చెందిన ఎర్రబలి శ్రీనివాసులు ప్రస్తుతం వైసీపీ జిల్లా కార్యదర్శిగా తన తమ్ముడు సరవణ కలిసి పొంగునూరుకు చెందిన పూజారి అంబికా స్వామి సూచనల మేరకు వీరంపల్లి సమీపంలో పూజలు నిర్వహించి తవ్వకాలు ప్రారంభించారు. మాజీ పోలీస్ సిబ్బంది వినోద్ కుమార్ సంప్రదించి జేసీబీ మోటార్స్ స్కానర్ , మరికొందరితో కలిసి రాత్రి తవ్వకాలు ప్రారంభించారు తవ్వకాలపై వచ్చిన సమాచారం మేరకు పలమనేరు అర్బన్ సీఐ మురళీమోహన్ రూరల్ సీఐ పరుశురాముడు ఆదేశాల మేరకు అర్బన్ ఎస్ఐ లోకేష్ పెద్ద పంజాణి స్టేషన్ పిఎస్ఐ మారెప్ప నేతృ త్వంలో దాడులు నిర్వహించారు.
కారు 4, బైకులను స్వాధీనం చేసుకున్నా రు. వీరిలో సునీల్ ( 33), సంతోష్ రెడ్డి, వెంకటేష్, శ్రీనివాసులు, వినోద్ మరో ఇద్దరు ముసుగు స్వాములు తప్పించుకున్నారు. వీరిని కూడా త్వరలో పట్టుకొని అరెస్ట్ చేస్తామని ఆయన తెలిపారు. గంగవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ పరుశురాం, ఎస్సై లోకేశ్వర్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.



