AP | రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇబ్బందులు లేకుండా చేడాలి…

AP | రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇబ్బందులు లేకుండా చేడాలి…

  • రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి
  • జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

AP | కర్నూలు ప్రతినిధి, జనవరి 27:- రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందించాలని, అదే విధంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి రిజిస్ట్రేషన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక అబ్బాస్ నగర్ లోని కర్నూలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా సెల్ డీడ్‌ల స్వీకరణ, డాక్యుమెంట్ల నమోదు విధానం, రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ఫైళ్ల భద్రత, కంప్యూటరైజ్డ్ ఎంట్రీలు, ప్రజలకు అందుతున్న సేవల తీరును కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.. డబుల్ రిజిస్ట్రేషన్ లాంటివి జరగకుండా రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఈసీ వెరిఫికేషన్ తో పాటు ప్రతి డాక్యుమెంట్‌ను ఒకటి, రెండు సార్లు జాగ్రత్తగా పరిశీలించి, ఎటువంటి పొరపాట్లు జరగకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయాలని కలెక్టర్ రిజిస్ట్రేషన్ అధికారులను ఆదేశించారు.

డాక్యుమెంట్లలో వివరాలు సరిగా నమోదు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రిజిస్ట్రేషన్ అధికారులను ఆదేశించారు… రిజిస్ట్రేషన్ కోసం వచ్చే ప్రజలకు అనవసర జాప్యం లేకుండా నిర్ణీత సమయంలో సేవలు అందజేయాలన్నారు.స్లాట్ బుకింగ్ లో సర్వర్ సమస్యలు లేకుండా చూసుకోవాలన్నారు. అనంతరం అక్కడే ఉన్న ప్రజలతో కలెక్టర్ మాట్లాడుతూ స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్ పనులు ఏ విధంగా చేస్తున్నారు, ఏమైనా సమస్యలు ఉన్నాయా, స్లాట్ బుకింగ్ చేసుకున్న వెంటనే పిలిపిస్తున్నారా, లేదంటే ఎక్కువ సమయం వేచి ఉండే విధంగా చేస్తున్నారా అని కలెక్టర్ ప్రజలను ఆరా తీశారు.. స్లాట్ బుకింగ్ చేసిన వెంటనే నిర్దేశించిన సమయానికి పిలుస్తున్నారని, పూర్తి అవ్వగానే డాక్యుమెంట్ లు కూడా ఇస్తున్నారని కలెక్టర్ కి తెలిపారు. సమావేశంలో కర్నూలు ఇన్చార్జి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ భార్గవ్, కర్నూలు ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ వర ప్రసాద్, రిజిస్ట్రేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply