AP | మెగా జాబ్ మేళా

AP | మెగా జాబ్ మేళా

AP | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ఏపీ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం నేషనల్ కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు అపూర్వ స్పందన లభించింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, నేషనల్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఇంతియా అహ్మద్, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మనియార్ ఖలీల్ లు పాల్గొని మాట్లాడారు.గ్రామీణ , పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతీ , యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామన్నారు. “ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగ అవకాశాలు తలుపు తట్టినప్పుడు వాటిని వదులుకోకూడదన్నారు.యువత తమలో ఉన్న ప్రతిభను గుర్తించి, ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూలను ఎదుర్కోవాలన్నారు. “కేవలం డిగ్రీ పట్టాలు ఉంటే సరిపోదని, మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా నైపుణ్యాలను (స్కిల్స్) మెరుగుపరుచుకోవాలన్నారు.

AP

ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ నిర్వహించిన ఈ మెగా జాబ్ మేళాలో దాదాపు 22 కంపెనీలు 2100 ఉద్యోగాలకు పైగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్న రు. చదువుకున్న ప్రతి యువకుడికి, యువతికి ఒక గౌరవప్రదమైన ఉద్యోగం లభించాలనేది మా ఆశయమన్నారు.విద్యార్థుల ముంగిటకే ఉద్యోగ అవకాశాలను తీసుకురావాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థతో ఈ ‘మెగా జాబ్ మేళా’ను ఏర్పాటు చేశామన్నారు .నేషనల్ విద్యాసంస్థలు కేవలం నాణ్యమైన విద్యకే కాకుండా, విద్యార్థుల కెరీర్ గైడెన్స్ మరియు ప్లేస్‌మెంట్స్ విషయంలో కూడా ఎప్పుడూ ముందుంటాయన్నారు ఈ కార్యక్రమంలో దూదేకుల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దస్తగిరి, నంద్యాల మార్కెట్ యార్డ్ డైరెక్టర్ స్వామి నాయక్, కామిని మల్లికార్జున, దీపక్ రెడ్డి, నేషనల్ విద్యాసంస్థల సెక్రటరీ రఫీ అహ్మద్ , నేషనల్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ వేణుగోపాల్, ప్లేస్మెంట్ అధికారి సాయికుమార్, మస్తాన్ వలి, మారుతి ప్రసాద్, కళాశాల అధ్యాపక బృందం , టిడిపి నాయకులు మరియు పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొన్నారు.

Leave a Reply