AP | శ్రీకాకుళం శక్తి.. ఈ ఉత్సవాలతో ఖండాలు దాటింది

AP | శ్రీకాకుళం శక్తి.. ఈ ఉత్సవాలతో ఖండాలు దాటింది

  • అలరించిన తమన్ లైవ్ ఆర్కెస్ట్రా
  • ఆస్వాదించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

AP | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్ర పండుగ హోదాలో జరుగుతున్న అరసవల్లి రథసప్తమి ఉత్సవాలలో కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శనివారం రాత్రి పాల్గొన్నారు. ధావోస్ నుండి డిల్లీ చేరుకున్న రామ్మోహన్ నాయుడు.. అక్కడి నుండి శ్రీకాకుళం లో జరుగుతున్న ఉత్సవాలకు చేరుకున్నారు. స్థానిక కోడి రామ్మూర్తి స్టేడియం లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలను ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. ఉత్సవాల సందర్భంగా తమన్ లైవ్ ఆర్కెస్ట్రా ఉత్సవ ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ఆర్కెస్ట్రా కొనసాగుతూ ఉండగానే మొదలైన డ్రోన్ షో.. ఆకాశాన్ని రంగులమయం చేసింది. ఆ తరువాత బాణసంచా చూపరులను విశేషంగా ఆకట్టుకుంది.

AP

ఈ సంధర్భంగా వేదికపై నుండి ఉత్సవాలను ఉద్దేశించి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. రాష్ట్ర పండుగ హోదాలో ఘనంగా ఉత్సవాలు జరుపుకునేందుకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆకాశంలో ఉన్న సూర్యుడు తాను ఉండటానికి చోటు ఎక్కడైనా సంపాదించుకొనే అవకాశం ఉన్నా.. ఆ అదృష్టం అరసవల్లి కి ఇవ్వడం మనందరి పూర్వజన్మ సుకృతం అని అన్నారు. అరసవల్లి రథసప్తమి ఉత్సవాలను గత ఏడాది నుండి రాష్ట్ర పండుగ హోదాలో చేస్తున్నామని.. చిన్న ప్రయోగంగా ప్రారంభమైన గత సంవత్సరం ఉత్సవాలు ఘన విజయం సాధించడంతో.. దానికి పదిరెట్ల స్థాయిలో ఈ ఏడాది ఉత్సవాలు జరిపినట్టు రామ్మోహన్ నాయుడు తెలిపారు.

AP

గడిచిన మూడు రోజులు అనేక కార్యక్రమాలు జరిగాయని.. ఉత్సవాలు విజయవంతం అవ్వడంలో సహకరించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ ఉత్సవాలు వినోదం కోసం చెయ్యలేదని.. శ్రీకాకుళం పవర్ ను విశ్వవ్యాప్తం చెయ్యడానికి దోహదపడ్డాయని రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం వాసి అంటే కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులు అని.. సింగపూర్ వెళ్ళినా శ్రీకాకుళం వాడు కనిపిస్తాడని తెలిపిన రామ్మోహన్ నాయుడు.. అరసవల్లి ఉత్సవాల గురించి ఖండాలు దాటి ఘనంగా చెప్పుకోవాలని అన్నారు. డ్రోన్ షో, హెలి రైడ్, సురభి నాటకాలు.. ఇలా ప్రతీ కార్యక్రమం స్థానికులను విశేషంగా అలరించాయని అన్నారు. ఉత్సవాలలో జరిగిన వినోద కార్యక్రమాలన్నీ ఒక ఎత్తు అయితే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ లైవ్ ఆర్కెస్ట్రా మరో ఎత్తు అని అన్నారు.

మంచి పాటలతో జోష్ నింపారు అని కితాబిచ్చారు. తమన్ ప్రోగ్రామ్ కోసం ఆయనకు కేవలం ఒక్క ఫోన్ కాల్ మాత్రమే చేశానని.. శ్రీకాకుళం పై ప్రేమతో ఒప్పుకున్నారని తెలిపారు. లైవ్ ఆర్కెస్ట్రా తనను సైతం ఎంతగానో అలరించిందనీ అన్నారు. ఈ ఉత్సవాలలో భాగస్వామ్యం అయిన ప్రతీ ఒక్క కళాకారుడికి, ఉత్సవాన్ని విజయవంతం చేసేలా కృషి చేసిన జిల్లా అధికారులు, పోలీసులు, ఇతర సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉత్సవ విజయానికి గుర్తుగా భాగస్వామ్యం అయిన అందరినీ ఘనంగా సత్కరించారు.

CLICK HERE TO READ అరసవల్లి రథసప్తమికి పోటెత్తిన భక్తులు

CLICK HERE TO READ MORE

Leave a Reply