AP | కేంద్ర న్యాయ శాఖ మంత్రి గారు….

AP | కేంద్ర న్యాయ శాఖ మంత్రి గారు….
- మా విన్నపాలు వినండి…..
- న్యాయవాదులకు న్యాయం చేయండి…
- కేంద్ర మంత్రి కి వినతి పత్రం ఇచ్చిన నంద్యాల కు చెందిన బిజెపి అధికార ప్రతినిధి…
AP | నంద్యాల బ్యూరో,ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని న్యాయవాదులకు పింఛన్ సౌకర్యం కల్పించాలని ఆరోగ్య భీమా అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లాకు హైకోర్టు బెంచ్ త్వరగా ఏర్పాటు చేయాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రాం మేఘవాలా ను రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు బిజెపి రాష్ట్ర న్యాయ విభాగం న్యాయవాదులు నంద్యాల కి చెందిన కాదరబాద్ నరసింగ రావు ఆధ్వర్యంలో శనివారం కేంద్ర న్యాయశాఖ మంత్రికి విన్నవించారు. విజయవాడకు వచ్చిన మంత్రి ని ప్రత్యేకంగా కలిసి సమస్యలను విన్నవించా రు. రాష్ట్ర న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. రాష్టంలో అన్ని ప్రముఖ రాజకీయ పార్టీలు సమర్ధించిన విధంగా ఆంధ్రప్రదేశ్ హై కోర్టు బెంచిని కర్నూలులో ఏర్పాటుకు మార్గం సుగమం చెయ్యాలని కోరారు.
న్యాయవాద పరిరక్షణ కొరకు దేశావ్యాప్తంగా న్యాయవాదుల సంరక్షణ కోసం త్వరితగతిన అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తేవాలని కోరారు. ఝార్కండ్ రాష్టంలో లాగా ఏపీ లోని న్యాయవాదులకి పెన్షన్ సౌకర్యం ఇచ్చేలాగున చర్యలు చేపట్టాలని మంత్రికి విన్నవించారు. రాష్ట్రంలోని న్యాయవాదులకు ఆరోగ్యభీమా అమలు అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్రంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, డి ఆర్ ట్ అప్పలటే ట్రిబ్యునల్, ఇన్కమ్ టాక్స్ ట్రిబ్యునల్ ను ఏర్పాటు చెయ్యాలని వినతిపత్రం సమర్పించారు. పై విషయాలను వినతి పత్రంలో స్వీకరించిన కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించరని నా దృష్టికి వచాన సమస్యలు తప్పకుండ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని న్యాయవాదులు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ హెడ్ క్వార్టర్ ఇంచార్జి ఉప్పలపాటి శ్రీనివాస రాజు, న్యాయవిభాగం రాష్ట్ర అధ్యక్షులు పి. వి.ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
