AP | యోగి వేమన విగ్రహావిష్కరణ

AP | యోగి వేమన విగ్రహావిష్కరణ

AP | శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రజాకవి, సామాజిక సంస్కర్త యోగి వేమన జయంతి సందర్భంగా గోరంట్ల పట్టణంలో ఏర్పాటు చేసిన యోగి వేమన విగ్రహాన్ని మంత్రి ఎస్.సవిత సోమవారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, యోగి వేమన తన పద్యాల ద్వారా సమాజానికి సత్యం, సమానత్వం, మానవత్వం వంటి ఉన్నత విలువలను అందించారని కొనియాడారు. వేమన బోధనలు నేటి సమాజానికి మరింత ప్రాసంగికమని, కుల, మత భేదాలకతీతంగా సామాజిక సామరస్యాన్ని నెలకొల్పడమే ఆయన సందేశాల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

సమాజంలో అసమానతలు, మూఢనమ్మకాలను వ్యతిరేకిస్తూ ప్రజలను చైతన్యవంతుల్నిచేసిన మహానుభావుడు యోగి వేమన అని మంత్రి అన్నారు. వేమన పద్యాలు సాధారణ ప్రజల భాషలో ఉండటంతో ఆయన ఆలోచనలు నేటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయని తెలిపారు. ముఖ్యంగా యువత వేమన బోధనలను ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులు, నాయకులు, కార్యకర్తలకు మంత్రి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, రెడ్డి సంఘం నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై యోగి వేమనకు ఘన నివాళులు అర్పించారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉత్సాహంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది.

Leave a Reply