రాప్తాడు లో చలివేంద్రాలు ఏర్పాటు చేయండి.

రాప్తాడు లో చలివేంద్రాలు ఏర్పాటు చేయండి.

రాప్తాడు , ఆంధ్రప్రభ : సూర్యుడు భగభగ మండుతూ నిప్పులు చిమ్ముతున్నాడు. ఎన్ని నీళ్లు తాగిన సరిగ్గా దాహం తీరడం లేదు. చల్లని గాలి లేక ఎండల వేడికి తట్టుకోలేక రాప్తాడు మండల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ దాహార్తిని తీర్చేందుకు మండల కేంద్రంలోని బస్టాండ్ సర్కిల్ ఎంపీడీవో ఆఫీస్ ముందర భారత్ పెట్రోల్ బంకు దగ్గర ఆటోనగర్ లోను చిన్మయ నగర్ మెయిన్ రోడ్డు పక్కన పంగల్ రోడ్డు నందు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే ఈ వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చవచ్చు.ప్రతిరోజు మండల కేంద్రంలోకి ఎంతోమంది ఉద్యోగులు నిరుద్యోగులు కూలీలు వ్యాపారస్తులు వివిధ గ్రామాల ప్రజలు వాళ్ళ అవసరాల నిమిత్తం వస్తూనే ఉంటారు.

ఉదయం నుండి మధ్యాహ్నం వరకు లేదా సాయంత్రం వరకు మండల కేంద్రంలోనే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది.ఈ 40 నుండి 42 డిగ్రీల ఎండల వేడికి తట్టుకోవడమే కష్టము అందులోనూ పదేపదే దాహం వేస్తూనే ఉంటుంది.దాహం తీరాలంటే టీ షాపులు కూలింగ్ షాపులలో నీళ్ల బాటిళ్ళు కొనాలి.ఒక లీటర్ నీళ్ల బాటిల్ ధర రూ.25 అందరు నీళ్లు కొని తాగలేరు.బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ చలివేంద్రాలు లేకపోవడం వలన మరింత ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందువలన ప్రజల దాహార్తిని తీర్చేందుకు స్వచ్ఛంద సంస్థలు రాజకీయ పార్టీలు ప్రజా సేవకులు ముందుకు వచ్చి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Leave a Reply