గాయపడిన పోలీసులను పరామర్శించిన హోం మంత్రి..

గాయపడిన పోలీసులను పరామర్శించిన హోం మంత్రి..

ఆంధ్రప్రభ – కృష్ణా బ్యూరో : కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీసుస్టేషన్ లో పేలుడు ఘటనలో గాయాలైన పోలీసులను హోం మంత్రి అనిత సోమవారం పరామర్శించారు. మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ లో పోలీసులు చికిత్స పొందుతున్నారు. గాయాలైన పోలీసులకు హోం మంత్రి అనిత ధైర్యం చెప్పారు. పోలీసుల కుటుంబ సభ్యులతో మాట్లాడి, ప్రభుత్వ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గాయాలైన పోలీసులు ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన రోజు నుండి ప్రతిరోజు ఎప్పటికప్పుడు పోలీసులు యొక్క ఆరోగ్య పరిస్థితులను మంత్రి అడిగి తెలుసుకుంటున్నారు. పోలీసులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.

హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ కృష్ణాజిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమతులు లేకుండా క్రాకర్స్ నిర్వహిస్తున్న దుకాణాల నుంచి క్రాకర్స్ ను సీజ్ చేశారని, కోర్టుకు తరలిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు క్రాకర్స్ ఫైర్ జరగటం వలన ఎస్సై ,కోర్ట్ కానిస్టేబుల్ మరియు ఇద్దరు కానిస్టేబుల్ కు గాయాలయ్యాయన్నారు. అబ్దుల్లా అనే కానిస్టేబుల్ 50 – 60% గాయాలతో ఉన్నారని, మిగతా వాళ్లకి కూడా ఎటువంటి ప్రాణాపాయం లేదన్నారు. గాయపడిన పోలీస్ వారి ఆరోగ్య పరిస్థితులను కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారన్నారు.

గాయపడిన వారు అందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఎంతో ప్రత్యేక శ్రద్ధతో వైద్యం అందిస్తున్న ఎన్నారై హాస్పిటల్ బృందానికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply