చిరువ్యాపారుల కోసం 5 కిలోల భారత్ గ్యాస్ సిలెండర్లు..

చిరువ్యాపారుల కోసం 5 కిలోల భారత్ గ్యాస్ సిలెండర్లు..

భవానీ గ్యాస్ అధినేత గద్దె శ్రీహరి బాబు

భవానిపురం , ఆంధ్రప్రభ : చిరు వ్యాపారులకు కూడా అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో 5 కిలోల సిలిండర్లను భారత్ గ్యాస్ అందుబాటులోకి తీసుకొచ్చిందని విద్యాధరపురం లోని శ్రీభవానీ గ్యాస్ కంపెనీ అధినేత గద్దె శ్రీహరి బాబు చెప్పారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆశయాలకు అనుగుణంగా నేడు చిరు వ్యాపారుల చెంతకే 5 కిలోల గ్యాస్ సిలెండర్లు అందుబాటులో బహిరంగ మార్కెట్ లో లభించేలా అధికారులు తగిన చర్యలు చేపట్టారని అన్నారు. ఆదివారం ఉదయం విజయవాడ రూరల్ ప్రాంతంలో ఉన్న జక్కంపూడి కాలనీ గ్రౌండ్లో భారత్ గ్యాస్ సేల్స్ ఆఫీసర్, జిల్లా కోఆర్డినేటర్ మండల్ ఆధ్వర్యంలో జరిగిన”మినీ గ్యాస్ మ్యాక్స్ కంఫర్ట్ ” కార్యక్రమంలో భాగంగా బహిరంగ సేల్ కార్యక్రమం నిర్వహించారు.

వలస కార్మికులకు పునుగులు, బజ్జిలు, నూడిల్స్ బండ్ల నిర్వాహకులు కేవలం ఆధార్ కార్డు, లేదా పాన్ కార్డులు చూపించిన వెంటనే వినియోగదారులకు అక్కడికక్కడే సిలెండర్లు అందించారు.ఈ శిబిరంలో 5 కిలోలు గ్యాస్ సిలెండర్లు రెగ్యులేటర్ తో సహా రూ. 1,560 కి వినియోగదారుల కు అందించారు. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలెండర్ల కు రూ 2,400 డిపాజిట్లు, రూ. 2,200 గ్యాస్ ధరలు వసూలు చేశారు.ఈ కార్యక్రమంలో సోషల్ వర్కర్ డి. రాము,పత్తిపాటి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.శ్రీ భవాని గ్యాస్ కంపెనీ ఆధ్వర్యంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అందుబాటులోకి రావడంతో వినియోగదారులు హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply