తాబేలు పిల్లలను సముద్రంలోకి వదిలిన ఎమ్మెల్యే

తాబేలు పిల్లలను సముద్రంలోకి వదిలిన ఎమ్మెల్యే
కోడూరు – ఆంధ్రప్రభ : ఆలీవ్ రిడ్లే తాబేలు పిల్లలు సముద్రంలోకి ప్రవేశించాయి. కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలం పాలకాయతిప్పలో బుధవారం ఉదయం అటవీ శాఖ వారు ఏర్పాటు చేసిన సముద్రపు తాబేళ్ల పునరుత్పత్తి కేంద్రాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సందర్శించారు. అటవీ శాఖ ఏలూరు డివిజన్ అధికారులతో కలిసి ఆలీవ్ రిడ్లే సముద్రపు తాబేలు పిల్లలను సముద్రంలో వదిలారు.
