ఏసీబీ అధికారులు దాడులు

ఏసీబీ అధికారులు దాడులు

మచిలీపట్నం, ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా మచిలీపట్నంలో పనిచేస్తున్న మోటారు వాహనాల పరిశీలకుడు పి.లోకనాథ ప్రసాద్‌పై ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం విస్తృత సోదాలు నిర్వహించారు. విజయవాడలోని లోకనాథ ప్రసాద్ నివాసంలో, మచిలీపట్నంలోని రవాణా శాఖ కార్యాలయంలో అలాగే ఆయన బంధువుల ఇళ్లలో ఏకకాలంలో దాడులు చేపట్టారు. మచిలీపట్నంలో గుంటూరు అవినీతి నిరోధక శాఖ పరిశీలకుడు అంబటి మన్మధరావు ఆధ్వర్యంలో అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. సోదాల సందర్భంగా రవాణా శాఖ కార్యాలయంలో ఉన్న ముఖ్యమైన దస్తావేజులు, ఆస్తులకు సంబంధించిన ఆధారాలను సేకరించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు కేసు నమోదు చేసి లోకనాథ ప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది.

Leave a Reply