సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ..

సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ..

గంపలగూడెం, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న రోగులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో దోహదం చేస్తోందని రాష్ట్ర సేంద్రీయ ఉత్పత్తులు ధ్రువీకరణ అథారిటీ చైర్మన్ శావల దేవదత్ అన్నారు.మంగళవారం ఆయన పార్లమెంట్ సభ్యుడు కేశినేని చిన్ని ద్వారా మంజూరైన సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.మండలంలోని పెద్దకొమెర, మేడూరు,ఆర్లపాడు,నెమలి, కనుమూరు గ్రామాల్లో పర్యటించి రూ.3,06,149 చెక్కులు లబ్ధిదారులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు చెరుకూరి రాజేశ్వరరావు,రేగళ్ల వీరారెడ్డి,మానుకొండ రామకృష్ణ, దిరిశాల వెంకట కృష్ణారావు,కావూరి బాబు,కోట వెంకటేశ్వరరావు, జంగా చెంచురెడ్డి,బూరుగు నారాయణ,వి.భరత్ రెడ్డి,పి.రాంబాబు,బి.కళ్యాణి,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply