స్వామి వారిని దర్శించుకున్న సినీ నటుడు..

స్వామి వారిని దర్శించుకున్న సినీ నటుడు..
మోపిదేవి, ఆంధ్రప్రభ : మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ హాస్య నటుడు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ (గద్దె రాజేంద్ర ప్రసాద్) దర్శించుకున్నారు. తొలుత నాగ పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఆయనకు డిప్యూటీ కమీషనర్ మరియు కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు శ్రీ స్వామివారి చిత్రపటాన్ని అందజేసి, ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు. రాజేంద్రప్రసాద్ తో సెల్ఫీలు దిగేందుకు పలు ఆసక్తి కనబరిచారు.
