భవిష్యత్తులో అధికారంలోకి వైసిపి పార్టీ యే…

భవిష్యత్తులో అధికారంలోకి వైసిపి పార్టీ యే…

16వ వసంతంలోకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఘనంగా వేడుకలు…

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో రాబోయేది వైఎస్ఆర్సిపి పార్టీయే అని రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాలకు వేదిక వైఎస్ఆర్సిపి పార్టీ అని ఎమ్మెల్సీ ఇస్సాకు బాషా వైసిపి పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ పి పి నాగిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ మాబున్నిసా, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, మహిళా విభాగం సెక్రటరీ శశికళ రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి అమృత రాజ్, మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ అజాద్ లు పేర్కొన్నారు.నంద్యాలలో గురువారం ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. మడమ తిప్పని పంతం,అడుగు తప్పని గమ్యం 16వ ఏట వైఎస్సార్‌సీపీ ప్రస్థానం లోకి అడుగుపెట్టిందని పేర్కొన్న రు.

ప్రజా గుండెల్లో వైఎస్సార్‌సీపీ 5 ఏళ్ల నమ్మకంతో మరో పోరాటానికి సిద్ధం గా ఉండాలని పిలుపునిచ్చారు.వైఎస్సార్ ఆశయాలకు వారసుడు 15 ఏళ్ల వైఎస్ జగన్ సుదీర్ఘ రాజకీయ ప్రయాణం!, కష్టాల నుంచి కోట్లాది మంది ఆశల వరకు.. వైఎస్సార్‌సీపీ 15 ఏళ్ల విజయగాథ! ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పుట్టిన పార్టీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేటితో 15 ఏళ్లు పూర్తి చేసుకుని 16వ వసంతంలోకి అడుగుపెడుతోందని కార్యకర్తలకు పిలుపునిచ్చరు.రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో వేడుకలు జరుపుకుంటున్నాయన్నారు.దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాల సాధనే లక్ష్యంగా.. ఓదార్పు యాత్ర ద్వారా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు.

ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జననేతగా ప్రజలకు చేరువయ్యారన్నారు.ఎమ్మెల్సీ ఇస్సాక్ బాష ఆద్వర్యంలో వైసీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ పీపీ నాగిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా ,ఎస్ ఈ సి మెంబర్ రామలింగారెడ్డి, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్,మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, స్టేట్ లీగల్ సెల్ అధికార ప్రతినిధి తిమ్మారెడ్డి,రాష్ట్ర మహిళ విభాగం సెక్రటరీ శశికళ రెడ్డి, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి అమృత రాజ్, వైసీపీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు రామసుబ్బయ్య, జిల్లా సెక్రెటరీ లు దేవనగర్ బాషా, శివనాగిరెడ్డి, వైసీపీ జిల్లా క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షుడు కారు రవికుమార్, మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, సాంస్కృతిక విభాగం అధ్యక్షులు టి వి రమణ, మున్సిపల్ కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు వార్డు ఇన్చార్జిలు వైసిపి నాయకులు, కార్యకర్తలు,హాజరయ్యారు.అభిమానులు ముందుగా దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు.

పార్టీ కార్యాలయం ఆవరణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ జెండాను వైసీపీ నేతలు ఆవిష్కరించారు.ప్రజల సంక్షేమం కోసం కులమతాలకు, వర్గాలకు, ధనిక, పేద అనే బేధం లేకుండా ప్రజల సంక్షేమమే ఊపిరిగా నిరంతరంగా కృషి చేసి 15 ఏళ్ళు పూర్తి చేసుకొని నేడు 16వ వసంతంలోకి అడుగిడుతున్న శుభ సంధర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఓదార్పు యాత్ర నుండి వేసిన అడుగులు ప్రజల సంక్షేమం దిశగా పోరాటాలు చేస్తూ నేటికి 15 వసంతాలు పూర్తి చేసుకుందన్నారు. రాజకీయాలకు, వర్గాలకు అతీతంగా అభివృద్ధి పథంలో నడిపిన ఏకైక పార్టీగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు.రాజకీయ ప్రస్థానంలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్క వైసీపీ నేతలకు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు సరికొత్త ఉత్సాహంతో పార్టీని మరింత భలోపతం చేయాలని, రానున్న ఎన్నికల్లో మరోసారి రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

Leave a Reply