18న తైబజార్ బహిరంగ వేలం

18న తైబజార్ బహిరంగ వేలం
మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మునుగోడు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఈ నెల 17వ తేదీ ఉదయం 10:30 గంటలకు తై బజార్ బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు.వేలంలో పాల్గొనదలచిన వారు ఈ నెల 16వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు పంచాయతీ కార్యదర్శి గ్రామపంచాయతీ మునుగోడు పేరుతో పశువుల సంతకు రూ.80 వేలు, కూరగాయల సంతకు రూ.40 వేల డీడీ తీసి పంచాయతీ కార్యాలయంలో సమర్పించాలన్నారు. 2026–27 సంవత్సరానికి సంబంధించిన తైబజార్ చార్జీల వసూలు హక్కులను 01-04-2026 నుంచి 31-03-2027 వరకు వేలం ద్వారా కేటాయించనున్నట్లు తెలిపారు.మరిన్ని వివరాలకు గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.
