AP | వివేకానందుని బోధనలు అనుసరణీయం

AP | వివేకానందుని బోధనలు అనుసరణీయం
AP | పెడన, ఆంధ్రప్రభ : స్థానిక శ్రీ వివేకానంద హైస్కూల్‌లో స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. స్వామి వివేకానంద చిత్రపటం వద్ద ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. వివేకానందుని బోధనలు నేటి యువత అనుసరించాలని, వాటి ద్వారా యువతలో క్రమశిక్షణ, మంచి నడవడిక, సమాజం పట్ల, బాధ్యత, పెద్దలపై గౌరవం అలవాడతాయని,

“లేవండి.. మేల్కొండి.. గమ్యం చేరే వరకు విశ్రమించకండి” అనే వివేకానందుని సూక్తి ద్వారా యువత వారు అనుకున్న లక్ష్యాలను సాధించి సమాజాభివృద్ధిలో, దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలని తెలియజేశారు. అదేవిధంగా సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎల్కేజీ, యూకేజీ చిన్నారులకు ఉపాధ్యాయులు భోగి పండ్లు పోశారు. చిన్నారులందరూ ఆరోగ్యంగా, భోగభాగ్యాలతో వర్ధిల్లాలని ఆశీర్వదించారు..
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు
