ఆపరేషన్ ‘వజ్రప్రహార్’

ఆపరేషన్ ‘వజ్రప్రహార్’

శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఆదేశాలతో శనివారం సోమందేపల్లి లో కార్డన్, సెర్చ్ నిర్వహించారు. మత్తు పదార్థాల నిర్మూలనపై ఉక్కుపాదం మోపడంతోపాటు .. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పెనుకొండ డిఎస్పి నర్సింగప్ప పేర్కొన్నారు. ఒక డిఎస్పి, ఇద్దరు సిఐలు, ఐదు మంది సైలు 50 మంది ,ప్రత్యేక బృందాలతో విస్తృత తనిఖీలు – సరైన పత్రాలు లేని వాహనాల సీజ్ చేశారు.

అధునాతన డ్రోన్లతో పర్యవేక్షణ..

నేరగాళ్ల కదలికలను కనిపెట్టేందుకు, మారుమూల ప్రాంతాలను తనిఖీ చేసేందుకు ఈ ఆపరేషన్‌లో అధునాతన డ్రోన్ కెమెరాలను ఉపయోగించారు. ఖాళీ భవనాలు, నిర్మానుష్య ప్రదేశాలను డ్రోన్ల ద్వారా క్షుణ్ణంగా వీడియో రికార్డింగ్ చేస్తూ తనిఖీలు చేపట్టారు.
పెనుగొండ డిఎస్పి నర్సింగప్ప నేతృత్వంలో సోమిందేపల్లి లో సమస్యాత్మక ప్రాంతాల్లో సోదాలు జరిగాయి.7, పోలీసుల ప్రత్యేక బృందాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.

తనిఖీల్లో భాగంగా సరైన ధృవీకరణ పత్రాలు లేని పలు ద్విచక్ర వాహనాలను, ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. పాత నేరస్థులు, అనుమానితుల ఇళ్లలో సోదాలు నిర్వహించి వారి ప్రస్తుత కార్యకలాపాలపై ఆరా తీశారు. ముఖ్యంగా యువతను పట్టిపీడిస్తున్న గంజాయి, డ్రగ్స్, కూల్-లిప్స్ మరియు నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై పోలీసులు తీవ్రంగా హెచ్చరించారు.

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చట్టాలను ప్రయోగిస్తాం.” అని డి.ఎస్.పి స్పష్టం చేశారు.

ప్రజా చైతన్యం – ప్రతిజ్ఞ..

ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ తో పాటు పెనుకొండ , ఎస్సైలు రమేష్ , వెంకటేశ్వర్లు, రవికుమార్, పోలీసు పాల్గొన్నారు.

ప్రజలకు విన్నపం…

మీ ప్రాంతంలో ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరిగినా లేదా మత్తు పదార్థాల విక్రయాల గురించి సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి. మీ వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయి.

అత్యవసర సహాయం కోసం: డయల్-112
మత్తు పదార్థాల సమాచారం కోసం (ఈగల్ టోల్ ఫ్రీ): 1972

శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై నిరంతరం ఇలాంటి ఆపరేషన్లు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.

Leave a Reply